మఠామ్నాయ మహానుశాసన మనీషి విద్వత్ పరిషత్ (రి)
26 Nov 2025 – ఢిల్లీ
బహిరంగ ప్రకటన
ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా
శృంగేరీ మఠానికి చెందిన ఒక వ్యక్తి “సంన్యాసి” వేష రూపములో తిరుగుతున్న “విధుశేఖర భారతి” అనే ఒక వ్యక్తి ని సంపూర్ణముగా ఒక పతిత సంన్యాసి గా నిర్ధారణ చేస్తూ , ఉద్గోషణ చేస్తూ , సనాతన ధర్మమునుండి, వైదిక పరంపరనుండి శ్రీ ఆది శంకరాచార్యుల దశనామి పరంపరనుండి సంపూర్ణముగా భహిష్కరించడమైనది, గతకొన్ని సంవత్సరములుగా జరుగుతున్న అనేక విషయములను నిశితముగా కూలంకషముగా పరిశీలించిన పిమ్మట ధర్మశాస్త్రము ఆధారముగా పరిషత్ నిర్ణయము , అటులనే శృంగేరీ మఠము నుండి కూడా బహిష్కరించడమైనది,
కొన్ని కారణములు : 1) సనాతన వర్ణాశ్రమ ధర్మానికి, 2) శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులవారి మూల సిద్ధాంతములకు 3) మఠామ్నాయ మహానుశాసనమునకు సంపూర్ణముగా విరుద్ధముగా ప్రవర్తించుట ,
3) అసత్యములు పలుకుట , వంచన చేయుట 4) మహానుశాసన నియమములు విరుద్దముగా ” తానుకూడా “శంకరాచార్య” “పీఠాధీశ్వరుడిని” అని అబద్దాలు చెపుతూ జనాలని మోసముచేస్తూ ధనార్జన చేస్తూ భక్తులను, వంచించుట ,
5) మఠ మర్యాదలను సంన్యాసి ధర్మములను వదలి ఇష్ఠానుసారము ప్రవర్తించుట , ఇత్యాది కారణములతో సన్యాసి వేషములో ఉన్న ఈ విధుశేఖర అనేవ్యక్తిని సనాతన , హిందూ ధర్మ , సంన్యాసి వ్యవస్థనుండి సంపూర్ణముగా బహిక్షరించటమైనది , ఈ నిర్ణయము 2500 సం పూర్వము శ్రీ ఆది శంకరాచార్యులు తమ ఆమ్నాయ పీఠ సంరక్షణకై మఠామ్నాయ మహానుశాసన ప్రకారము ఎవరైనా అనధికారులు, అయోగ్యులు తమ పీఠ విషయములో అధర్మముగా కలుగజేసుకొంటున్నా అటువంటి వారిని నిగ్రహము చేసి తద్వారా మఠ , ధర్మ పరిరక్షణ కార్యమునకు “మనీషి” విద్వత్ పరిషత్ కు ఇచ్చిన అధికారము తో
(Shloka 60:
उक्तलक्षणसम्पन्नः स्याच्चेन्मत्पीठभाग् भवेत् ।
अन्यथारूढपीठोऽपि निग्रहार्हो मनीषिणाम् ॥ 60 ॥)
నియమాలను అనుసరించి ఈ నిర్ణయము చేయబడినది , చత్వారః సమభాగినః అను ప్రమాణమును అనుసరించి శ్రీ భారతీ తీర్థ స్వామివారికి కూడా ఈ విషయములో సహా భాగి కావున మీకు కూడా ఒక అవకాశము, మా మర్యాద పూర్వక నివేదన : ఇందులో మీకు ఎటువంటి ఆపేక్షణలు ఉన్నా మీకు నిజముగా శ్రీ శారదా శ్రీ చంద్రమౌలీశ్వరుల, శ్రీ ఆది శంకరాచార్యుల వారిపై విశ్వాసము ఉన్నచో ఒక 15 రోజులలోపు మాత్రమే మీ ఆపేక్షణలను మీరే స్వయముగా లిఖితపూర్వముగా తెలియజేయవచ్చు , పూర్వము కూడా మీకు ఈ విషయములలో సమాధానానికి ( 31 ఆగస్టు 2025) సవినయముగా పత్రము వ్రాసియుంటిమి కానీ మీ నుండి ఎటువంటి సమాధానము రాని కారణముగా ఇది మీకు చివ్వరి అవకాశము,
( ఢిల్లీలో పరిషత్ తరుపున తీర్మానము )
ప్రతి : 1) శృంగేరీ శ్రీ భారతీ తీర్థ స్వామివారికి,
2) అడ్మినిస్ట్రేటర్ శృంగేరి మఠము
